KTR: ఎకరాకు రెండు కోట్ల లంచం అడిగిన మంత్రి పొంగులేటి ?

KTR vs ponguleti
KTR vs ponguleti

KTR: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్. ఎకరాకు రెండు కోట్ల లంచం మంత్రి పొంగులేటి అడిగాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్. నిజాం నాటి కాలం నుంచి ఉన్న 250 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని బాధితులు మా దగ్గరికి వచ్చారని వివ‌రించారు. KTR

KTR on Minister Ponguleti asked for a bribe of two crores per acre

ఈ విషయంపై రెవెన్యూ మంత్రిని అడిగితే.. ఎకరాకు రూ. 2 కోట్లు ఇవ్వాలని, లేదా జాగా రాసివ్వమని బెదిరించారని చెప్పారని తెలిపారు కేటీఆర్. మంత్రి పొంగులేటి కుమారుడు హర్ష భూకబ్జా బాగోతాలను, తమను వేధించిన తీరుని వివరించారు వట్టినాగుల పల్లి బాధితులు. 70 మంది బౌన్సర్లను తీసుకొచ్చి జేసీబీలతో హల్చల్ చేశారంటూ ఆవేదన వ్య‌క్తం చేశారు. దీనిపై కేటీఆర్ మాట్లాడారు. మంత్రి పొంగులేటి భూదాహం కోసం.. అరాచకాలకు పాల్పడుతున్నాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. KTR

Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా

రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని ORR కి అటువైపు క్రషర్స్, ఇటువైపు కబ్జాలకు పాల్పడుతున్నాడని బాంబ్ పేల్చారు. ధరణిలో ఉన్న 20 లక్షల నిషేధిత స్థలాలను జాబితా నుంచి 100 రోజుల్లోనే తొలగిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల్ని అడ్డం పెట్టుకుని, అరాచకం పర్వానికి తెరలేపి కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్. KTR

Also Read: KCR: త్వరలోనే కెసిఆర్ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్?

Share your love