
BJP: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపించిన నిధులు బీజేపీ జిల్లా ఇంచార్జ్‌లు స్వాహా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో డబ్బులు తిరిగి చెల్లించాల్సిందే అంటూ అధిష్టానం సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వార్డులను ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి అందుకు తగినట్లు డబ్బు పంపిందట బీజేపీ అధిష్టానం. BJP
BJP district in-charges embezzled funds sent by the high command for Telangana municipal elections
అయితే జిల్లా ఇంచార్జ్‌లు అభ్యర్థులకు డబ్బు ఇవ్వకుండా, సగానికి పైగా డబ్బులను స్వాహా చేసినట్లు గుర్తించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట బీజేపీ అధిష్టానం. ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాకు చెందిన మహిళా నాయకురాలిపై, కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఉదంతం బయటపడినట్లు సమాచారం అందుతోంది. దీంతో మొత్తం పది జిల్లాల్లో ఇదే జరిగిందని, బాధ్యులకు నోటీసులు ఇచ్చేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. BJP
Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో నిధులు దుర్వినియోగం జరిగిందని గుర్తించారని సమాచారం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే జరగడంతో అధిష్టానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. అయితే స్థానిక బడా నాయకులకు తాము డబ్బులిచ్చి పదవులు కొనుక్కున్నామని అంటున్నారు. ఖర్చు చేసిన డబ్బులు ఎలా రావాలని ప్రశ్నిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు నిధులు ఎలా జమ చేసుకోవాలని రాష్ట్ర నాయకులను నిలదీస్తున్నారు బాధ్యులు. BJP
Also Read: KCR: త్వరలోనే కెసిఆర్ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్?





