

BRS: సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ కొత్త పోరాటానికి సిద్ధం అవుతోంది. సికింద్రాబాద్ అస్తిత్వం శాంతి ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ ఎస్ పార్టీ రెడీ అయింది. అయితే, ఈ గులాబీ పార్టీ పోరాటాన్ని అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శాంతి ర్యాలీకి అనుమతి లేదంటు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. BRS
BRS peace rally for the existence of Secunderabad
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బైటకి వెళ్లకుండా తెలంగాణ భవన్ ముందు పోలీసులు మోహరించారు. పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై తలసారి సీరియస్ అయ్యారు. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా? అని ప్రశ్నించారు తలసాని. ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే, రాత్రి 10:40 గంటలకు పోలీసులు రిజెక్ట్ చేశారని నిప్పులు చెరిగారు. BRS
Also Read: BRS: మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను..స్పీకర్ కు బిగ్ షాక్!
ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే మేము కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకునే వాళ్ళం కదా!! అంటూ వ్యాఖ్యానించారు. అనుమతి లేని సెక్రటేరియట్ ముందు రేవంత్ రెడ్డి ర్యాలీ చేయవచ్చని… రేవంత్ రెడ్డి ర్యాలీకి వెళ్ళే ప్రాంతంలో ఎవరైనా అడ్డుకుంటే వారిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మేము ర్యాలీకి పిలుపునిస్తే కర్ఫ్యూను తలిచినట్లు వేలాది మంది పోలీసులను పెట్టి అందరిని అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ను మూడు ముక్కలు చేస్తే ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు. BRS
Also Read: kavitha: ఆ మీడియా ఛానల్ పై కన్నేసిన దేవనపల్లి కవిత ?







