CM Revanth Reddy: రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి సరికొత్త కార్యక్రమం?

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారట. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రతి జిల్లాలో పర్యటించి గ్రౌండ్ స్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించబోతున్నారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. CM Revanth Reddy

CM Revanth Reddy to tour districts from December 1

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రైతుబంధు అలాగే రుణమాఫీ, యూరియా కొరత లాంటి సమస్యలు కాంగ్రెస్ కు ప్రమాదకరంగా మారాయి. ఇలాంటి నేపథ్యంలో వాటన్నిటిని మైమర పెంచి, కాంగ్రెస్ వైపు ఓటర్లు మల్లెల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాల్టి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది. CM Revanth Reddy

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జీవితం నాశనం చేసింది ఈ లేడీనే ?

డిసెంబర్ 11, 14, 17 మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కచ్చితంగా కాంగ్రెస్ గెలవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఆ బాధ్యతను మొత్తం రేవంత్ రెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల పర్యటనకు రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇటీవల తన సొంత నియోజకవర్గ కొడంగల్లో పర్యటించి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపారు. అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. CM Revanth Reddy

Also Read: Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ స‌పోర్ట్‌?

Share your love