Mynampally Hanumanth Rao: మైనంపల్లి హనుమంతరావు పై కాంగ్రెస్ వేటు?

Mynampally Hanumanth Rao
Mynampally Hanumanth Rao

Mynampally Hanumanth Rao: తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు మారడంలో మైనంపల్లి హనుమంతరావును మించిన వారు లేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి హనుమంతరావు జంప్ అవుతారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనంపల్లి హనుమంతరావు, కెసిఆర్ అధికారంలోకి రాగానే గులాబీ కండువా వేసుకున్నారు. Mynampally Hanumanth Rao

Congress expels Mynampally Hanumanth Rao

అలా మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిపొందిన మైనంపల్లి హనుమంతరావు, మొన్న తన కొడుకు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత అనేక వివాదాల్లో ఇరుక్కుంటున్న మైనంపల్లి హనుమంతరావు, తాజాగా మరో ఆడియోతో అడ్డంగా దొరికిపోయారు. మెదక్ జిల్లాకు సంబంధించిన ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ కాల్ చేసి బెదిరింపులకు దిగాడు మైనంపల్లి హనుమంతరావు. సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలువ‌వు అంటూ గరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించాడు మైనంపల్లి హనుమంతరావు. Mynampally Hanumanth Rao

Also Read: Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయ‌ణ వివాద‌స్పద వ్యాఖ్య‌లు ?

దీనికి సంబంధించిన ఆడియో వైరల్ గా మారింది. అయితే ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంతరావును సస్పెండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సిద్దిపేట నేతలు అతనిపై ఫిర్యాదు చేయగా, ఇప్పుడు మెదక్ కాంగ్రెస్ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మైనంపల్లి పై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Mynampally Hanumanth Rao

Also Read: Kalvakuntla Kavitha: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రువు తీసిన క‌విత‌..ఆయ‌న ఎప్పుడూ సమైక్యావాదినే

Share your love