
Dallas: కేటీఆర్ వర్సెస్ నారా లోకేష్ మధ్య ఫ్యాన్ వార్ కొనసాగుతోంది. తాజాగా డల్లాస్ పర్యటనకు నారా లోకేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ ను డల్లాస్ లో పట్టించుకునే నాధుడే లేడంటూ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అంతకుముందు గులాబీ పార్టీని రెచ్చగొట్టేలా, ఎల్లో సోషల్ మీడియా కాస్త ఓవర్ గా బిహేవ్ చేసింది. Dallas
Dallas Has Nara Lokesh lost his dignity in front of KTR
ఐటి శాఖ మంత్రి ఎవరికి కూడా దక్కని అరుదైన గౌరవం నారా లోకేష్ కు డల్లాస్ లో దక్కిందని పోస్టులు పెట్టారు టిడిపి వారియర్స్. దీంతో చిర్రెత్తిపోయిన గులాబీ పార్టీ సోషల్ మీడియా కౌంటర్ స్టార్ట్ చేసింది. గత ఆరు నెలల కిందట కేటీఆర్ డల్లాస్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు లభించిన ఆహ్వానం, అక్కడి జన ఆదరణకు సంబంధించిన పోస్టులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు గులాబీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్. Dallas
Also Read: IndiGo cancellations: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును అవమానించిన టీడీపీ ?
నారా లోకేష్ కు జనాలు ఎవరు రాలేదని, కేటీఆర్ కు చాలా మంది ఆహ్వానం పలికారని గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందులో నారా లోకేష్ కు జనాధారణ తక్కువగా ఉండగా, కేటీఆర్ కు మాత్రం జనాలు ఎక్కువగా వచ్చారు. ఈ వీడియోలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య వార్ వాతావరణాన్ని సృష్టిస్తోంది. Dallas
Also Read: KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజన్, ఇక దూకుడే





