
Shoaib Malik: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అంటే తెలియని వారు ఉండరు.. ఇతర దేశాల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన ప్లేయర్. అలాంటి సానియా మీర్జా పాకిస్తాన్ కు చెందినటువంటి షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా జీవించిన వీరి మధ్య ఏం పుట్టిందో ఏమో విడాకుల ద్వారా దూరమైపోయారు..ముఖ్యంగా షోయబ్ మాలిక్ వేరే అమ్మాయితో రిలేషన్స్ లో ఉండడం వల్లే సానియా మీర్జాకు విడాకులు ఇచ్చినట్టు తెలుస్తోంది..
Did Sania Mirza Usuru hit Shoaib Malik
ఇదే తరుణంలో సానియా మీర్జా షోయబ్ మాలిక్ కు శాపనార్ధాలు కూడా పెట్టినట్టు సమాచారం. షోయబ్ సానియాని వదిలిపెట్టిన తర్వాత మరో నటి అయినటువంటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నారు. అయితే వీరి బంధం కూడా ఇబ్బందుల పాలయ్యిందని సమాచారం.. మరి ఇలా ఎందుకు జరుగుతుంది వివరాలు చూద్దాం..షోయాబ్ మాలిక్ సానియా మీర్జాని పెళ్లి చేసుకోవడానికి ముందే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా ఎక్కువ కాలం జీవించలేకపోయాడు.(Shoaib Malik)
Also read: Producer: అమ్మాయిని వాడుకొని మోసం చేసిన బడా నిర్మాత.. నోటీసులు ఇచ్చే టైంకి.!
ఆమెకు విడాకులు ఇచ్చి సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. ఈమెతో 15 సంవత్సరాల పాటు హ్యాపీగా జీవించి పిల్లలు పుట్టిన తర్వాత పాకిస్తానీ నటి సనాజావేద్ తో ప్రేమలో పడి, సానియాకు దూరమయ్యాడు. చివరికి సానియాకు విడాకులు ఇచ్చిన తర్వాత సనాజావెద్ ను వివాహం చేసుకున్నాడు.. అయితే వీరి పెళ్లి జరిగి కొన్ని నెలలు కూడా గడవకముందే వీరు విడిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు వీళ్ళు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నట్టు సమాచారం.

అంతేకాదు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సనా కాస్త కోపంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఒకే సోఫాలో కూర్చున్న ఒకరికొకరు కనీసం మాట్లాడుకోవడం కూడా చేయలేదు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, వీరు కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సానియా మీర్జా అభిమానులు సానియా ఉసురు షోయబ్ మాలిక్ కి తగిలింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు..(Shoaib Malik)

