

Gorantla Butchaih Chowdary: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో పెరిగిన కేసీఆర్, మంత్రి పదవి రాకపోవడంతో బయటకు వెళ్లినట్లు బాంబు పేల్చారు. టిడిపి నాయకుల్లో అందరికంటే జూనియర్ కేసీఆర్ అంటూ విషం కక్కారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. Gorantla Butchaih Chowdary
Gorantla Butchaih Chowdary slams kcr over tdp
అధికారం లేకపోవడం వల్ల చంద్రబాబుపై ఇప్పుడు కేసీఆర్ విమర్శలు చేస్తున్నట్లు నిప్పులు చెరిగారు. బనకచర్ల ఆంధ్ర ప్రదేశ్ లో కట్టుకుంటే తప్పేముంది అంటూ నిలదీశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై గులాబీ పార్టీతో పాటు వైసిపి కూడా కౌంటర్ ఇస్తోంది. మంత్రి పదవి రాలేదని కెసిఆర్ టిడిపి నుంచి బయటకు వెళ్లినట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రచారం చేస్తున్నది బాగానే ఉందని కౌంటర్ ఇస్తోంది వైసిపి. Gorantla Butchaih Chowdary
Also Read: Rayachoti Demands : రాయచోటి మంటలు…ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా ?
మరి కాంగ్రెస్ లో పెరిగి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ కూడా ఆ పార్టీని వదిలి టిడిపి గెలవగానే చంద్రబాబు ఎందుకు జంప్ అయ్యాడని నిలదీస్తోంది. దీనిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమాధానం ఇవ్వాలని వైసిపి తో పాటు గులాబీ పార్టీ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. టిడిపిలోకి వచ్చి సరిగ్గా ఉండకుండా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఎందుకు పార్టీని లాక్కున్నాడని నిలదీస్తోంది. ఆ సమయంలో నీవు ఎన్టీఆర్ వైపు ఎందుకు వెళ్లావు? దీనికి సమాధానం చెప్పు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నిలదీస్తోంది. Gorantla Butchaih Chowdary
Also Read: Poonam Kaur: డైరెక్టర్ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్







