

KTR: గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిస్తే నీకు ఉంటది రా పొట్టోడా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. KTR
KTR slams cm revanth reddy over kcr
కెసిఆర్ ను అన్ని మాటలు అనడానికి ఎవడివిరా నువ్వు అంటూ నిప్పులు చెరిగారు. కెసిఆర్ తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావని రేవంత్ రెడ్డిని నిలదీశారు కేటీఆర్. చంద్రబాబు నాయుడు సంచులు మోసిన బ్రోకర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావా ? ఎన్ని గుండెలు అంటూ రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. KTR
Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జరిమానా?
కెసిఆర్ అభివృద్ధి చేసిన దాంట్లో 1% కూడా మీరు చేయలేదని ఫైర్ అయ్యారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఇందులో ఎలాంటి డౌట్ లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను మించిన నాయకుడు లేడని తెలిపారు. KTR
Also Read: Andhra University: విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో లైంగిక వేధింపులు కలకలం







