CM REVANTH REDDY : కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ.. సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న‌ల్ ట్వీట్..!

CM REVANTH REDDY : తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ద‌శాబ్దాలుగా నెల‌కొన్న కృష్ణా, గోదావ‌రి జ‌లాల పంపిణీ అంశాలు ఇంకా ప‌రిష్కారం కాలేదు. ఈ విష‌యం ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో ఒక‌రిపై మ‌రొక‌రూ విమ‌ర్శించుకున్న విష‌యం విధిత‌మే. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ ట్వీట్ చేశారు. దేవాదుల సాక్షిగా కృష్ణా, గోదావ‌రి జ‌లాల సాధ‌న‌లో వివాద‌మా, ప‌రిష్కారమా అంటే తాము ప‌రిష్కారం కోరుకుంటామ‌న్నారు.

DISTRIBUTION OF KRISHNA AND GODAWARI WATERS..CM REVANTH REDDY SENSATIONAL TWEET

రాష్ట్రంలో ప్ర‌తి పౌరుడికి తాగునీరు ప్ర‌తి ఎక‌రానికి సాగునీరు అందివ్వ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వం ముందున్న టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసారు. కృష్ణా, గోదావ‌రి న‌దుల నీటి వాటా విష‌యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య త‌లెత్తే అభిప్రాయ భేదాల‌ను పంచాయితీల ద్వారా కుండా స్నేహ‌పూర్వ‌కంగా ప‌రిష్క‌రించుకుంటామ‌న్నారు.

Also Read : CM REVANTH REDDY : పేదల ఇళ్ల పై కాంగ్రెస్ జేసీబీ

విభ‌జ‌న చట్టం ప్ర‌కారం.. తాత్కాలికంగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ‌కు 299 టీఎంసీల‌ను కేటాయించారు. అయితే త‌మ‌కు స‌మాన వాటా కావాల‌ని తెలంగాణ మొద‌టి నుంచి డిమాండ్ చేస్తోంది. కృష్ణా జలాల వివాదాల ప‌రిష్కారానికి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీని పరిశీలిస్తోంది. 2004లో ఏర్పాటైన ఈ ట్రిబ్యునల్, 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, సెక్షన్ 89 కింద తెలంగాణ, ఏపీల మధ్య నీటి వాటాల పునఃపంపిణీపై ఈ ట్రిబ్యునల్ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కు ఏపీ ప్ర‌భుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read : HARISH RAO : ఫ్యూచ‌ర్ సిటీ మీద పెట్టిన శ్ర‌ద్ధ‌.. హెల్త్ సిటీ మీద పెడితే బాగుండేది

Share your love