

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం, ఉద్యమారుడు కేసీఆర్ ప్రెస్ మీట్ డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ కొత్త ఎత్తుగడలు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావల్సినంత సమయం ఇచ్చామని కేసీఆర్ వెల్లడించారు. ఇకపై ప్రజా సమస్యలపై కొట్లడతానని కార్యాచరణ ప్రకటించారు కేసీఆర్. దీంతో ఒక వారం రోజుల్లో ఏదో ఒక కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోన్నారట రేవంత్. అనంతరం అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. KCR
KCR Notices to KCR, arrest soon
అయితే, దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు. జుకో లీకిచ్చుడు కాదు.. మగాడివైతే కెమెరా ముందుకొచ్చి మాట్లాడమని సవాల్ చేశారు కేటీఆర్. శిఖండి రాజకీయాలు తప్ప.. మగాడిలాగా రాజకీయాలు చేసే దమ్ము లేదని ఆగ్రహించారు. చిట్‌చాట్‌ల వెనకాల దాక్కోవడమే కాదు.. దమ్ముంటే కెమెరా ముందుకి రా అంటూ ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. KCR
Also Read: Ys Jagan: జగన్ అభిమానులపై లాఠీఛార్జ్ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి ?
త్వరలోనే కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు కేటీఆర్. మునుగోడు, దేవరకొండల మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో ఈ సభను నిర్వహిస్తామని తెలిపారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిల ఇజ్జత్ తీసేసిన కేటీఆర్, కేసీఆర్ గర్జిస్తే.. నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి నీళ్ల మంత్రి పారిపోయిండని పరువు తీశారు. ఇంకొక మంత్రి ఏమో నీళ్లు+వాటర్ అని మాట్లాడుతాడంటూ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. KCR
Also Read: CM Revanth Reddy: రాష్ట్రపతికి ఘోర అవమానం..మరో వివాదంలో సీఎం రేవంత్ ?







