దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కు పెద్ద రెస్పాన్స్ వస్తోంది. లోకేష్ Veto లో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అక్కడి ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కొన్ని సంస్థలతో సమావేశాలు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి.
కొరియా ట్రేడ్-ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ (కోట్రా) డైరెక్టర్ క్యుంగ్‌హూన్ కిమ్ ఎక్స్ లో స్పందిస్తూ, లోకేష్ బృందానికి హ్యాట్సాఫ్ అంటూ అభినందించారు. షూఆల్స్, సోలమ్, ఏపాక్ట్, శాంసంగ్, ఎల్జీ, బూయంగ్, హ్వాసెంగ్ వంటి ప్రముఖ కంపెనీలతో లోకేష్ సమావేశాలు నిర్వహించారు. ప్రతి కంపెనీ అవసరాలకు తగ్గట్టు ప్రత్యేక ప్రపోజల్స్ ఇవ్వడం, రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఫుట్‌వేర్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు చూపించడం జరిగింది.
లోకేష్ బుసాన్ లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీని సందర్శించి, అక్కడి మెడికల్ మాగ్నెటిక్ టెక్నాలజీ, వైబ్రేషన్ చిప్‌లతో తయారయ్యే పాదరక్షల ప్రక్రియను పరిశీలించారు. హ్వాసంగ్ గ్రూప్ తో సమావేశంలో కుప్పంలో ఫుట్‌వేర్ యూనిట్ వేగవంతం చేయడం, భవిష్యత్తులో రాష్ట్రంలో హ్వాసంగ్ తయారీ క్లాస్టర్ ఏర్పాటు చేయడం వంటి అంశాలు చర్చించారు. ఈ లోకేష్ Veto పూర్తి స్థాయిలో ఎకనామిక్ డిప్లమసీలా సాగుతోంది.
వచ్చే శుక్రవారం సియోల్ లో జరిగే రోడ్‌షో లో మరిన్ని కొరియా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేలా లోకేష్ వారిని ఇన్వైట్ చేయనున్నారు. ఈ పర్యటనతో రాష్ట్రానికి కొత్త ఇండస్ట్రియల్ పార్టనర్‌షిప్‌లు, ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం ఖాయం అని అంచనా. కొరియా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశంసలు చూస్తే, లోకేష్ Veto త్వరలో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకురాబోతుందని క్లియర్ గా తెలుస్తోంది.





