Sutlej Ban: సత్లుజ్ సినిమాపై కేంద్రం నిషేధాన్ని సమర్థించింది

దిల్జిత్ దోసంజ్ నటించిన సత్లుజ్ సినిమాపై కేంద్రం నిషేధాన్ని సమర్థించింది. ఈ సినిమా భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు ముప్పు కల్పిస్తుందని ప్రభుత్వ ఉన్నత స్థాయి అంతర-విభాగ కమిటీ (IDC) నిర్ణయించింది. దీంతో ZEE5 వంటి OTT ప్లాట్ఫారమ్లలో సినిమా బ్లాక్ చేయడాన్ని కేంద్రం సమర్థించింది.

సినిమా స్టోరీ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా తీశారు. ఇందులో 1984 నుండి 1994 మధ్య పంజాబ్లోని వేలాది అనాథ శవాల దహన సంస్కారాలపై దర్యాప్తు చూపించారు. కానీ కమిటీ ప్రకారం, ఈ సినిమా పంజాబ్ ఉగ్రవాద రోజుల్లో భద్రతా దళాలు చేసిన చర్యల్ని మాత్రమే హైలైట్ చేస్తూ, ఉగ్రవాదుల్ దుష్కృత్యాల్ని కవర్ చేస్తుంది. అందుకే సెక్షన్ 69A ప్రకారం ఈ బ్లాకింగ్ పూర్తిగా సరైనదేనని కమిటీ క్లియర్ చేసింది.

జూలై 3న ZEE5 లో రిలీజ్ అయిన రెండు రోజులకే ఈ సినిమాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిలిపేసింది. భద్రతా కారణాలు ఇవ్వడంతో ఈ వివాదం పంజాబ్లో పెద్ద ఎత్తున రాజకీయంగా మారింది. షిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుండగా, షిరోమణి అకాలీ దళ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శనకు పిలుపునిచ్చింది. సత్లుజ్ సినిమాపై నిషేధం ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్లా మారింది.

ఇలా సత్లుజ్ సినిమాపై నిషేధాన్ని కేంద్రం సమర్థించడంతో ఈ సినిమా ఫ్యూచర్ గురించి క్లారిటీ లేదు. కానీ ఈ డిబేట్లో కేంద్రం మాత్రం తమ నిర్ణయం దేశ భద్రతకు సంబంధించినదని స్పష్టం చేస్తోంది. సత్లుజ్ చిత్రంపై ఈ నిషేధం ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి.

Share your love