Sandhya Case : ‘సంధ్య’ కేసులో ప్ర‌భుత్వానికి ఝ‌ల‌క్ ఇచ్చిన కోర్టు

Sandhya Case : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను కుదిపేసిన సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌రోసారి కోర్టు ఝ‌ల‌క్ ఇచ్చింది. పోలీసులు దాఖ‌లు చేసిన ఛార్జ్ షీట్ ను నాంప‌ల్లి కోర్టు రెండో సారి తిర‌స్క‌రించింది. ప్ర‌ధానంగా పోలీసుల ఛార్జ్ షీట్ లో స‌రైన సాక్ష్యాలు, ఆధారాలు లేవ‌ని.. సాంకేతిక లోపాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. Sandhya Case

court gave Jhalak to the government in ‘sandhya’ case

ఈ కేసులో అల్లు అర్జున్ తో స‌హా 23 మంది పై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖ‌లు చేశారు. ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న ఆధారాలు, స‌మ‌ర్పించినటువంటి సాక్ష్యాలు పొంత‌న లేక‌పోవ‌డంతోనే కోర్టు దానిని రెండు సార్లు తిరిగి పంపింది. హార్డ్ డిస్క్ లు, సీడీలు, పెన్ డ్రైవ్ లు స‌రిగ్గా జ‌త చేసి ఛార్జ్ షీట్ పంపాల‌ని తాజాగా పోలీసుల‌ను నాంప‌ల్లి కోర్టు ఆదేశించింది. మ‌రోవైపు ఈ కేసులో పోలీసుల వైఖ‌రీ పై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. Sandhya Case

Also Read : Naa Anveshana : ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈక‌తో స‌మానం..!

గ‌తంలో కాంగ్రెస్ వ‌ర్గాలు సిద్ధం చేసిన ఎడిట్ వీడియోల‌ను మీడియాకు సాక్ష్యాలుగా పోలీసులు విడుద‌ల చేశారు. అదే వీడియోను కోర్టుకు స‌మ‌ర్పించారా..? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే తెలంగాణ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి నోటీసుల‌ను జారీ చేసింది. అలాగే శ్రీతేజ్ కుటుంబానికి రూ.5ల‌క్ష‌లు ప‌రిహారం చెల్లించి, పోలీసుల‌పై పూర్తి నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి ఛార్జ్ షీట్ ప‌ట్ల కోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం ప్ర‌భుత్వానికి కాస్త ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని తీసుకొచ్చింది. Sandhya Case

Also Read : Y.S.Jagan : టీవీలో చూస్తే మ్యాచ్ క‌న‌ప‌డదా..? కొలంబో వెళ్లాలా..?

Share your love