మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా రూపొందిస్తున్నాడు దర్శకుడు వశిష్ట్. ఈ మధ్య ఇతర డైరెక్టర్స్ తమ సినిమాను ప్రమోట్ చేసినట్లే తన మూవీని కూడా ప్రమోట్ చేసుకుంటున్నాడు వశిష్ట్. అయితే ఈ క్రమంలో ఆయన స్టోరీ రివీల్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో వశిష్ట్ విశ్వంభర కథను గురించి పూర్తిగా చెప్పేస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి.
సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందుతున్న విశ్వంభర కథ గురించి పూర్తిగా చెప్పేస్తే ఆడియన్స్ లో క్యూరియాసిటీ తగ్గిపోతుందని, థియేటర్స్ లో ఆ థ్రిల్ పోతుందని మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇక మిగిలింది వీఎఫ్ఎక్స్ వర్కే. ఈ పనులు పూర్తయితే విశ్వంభర డేట్ అనౌన్స్ చేస్తారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.





