కమల్, రజినీతో భారీ మల్టీస్టారర్

కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ 2 చేస్తానని ప్రకటించారు. కూలీ రిలీజ్ తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తాడనుకుంటే.. ప్లాన్ మార్చాడని కోలీవుడ్, టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. కూలీ అంచనాలు అందుకోలేకపోయింది. లోకేష్ కూడా విమర్శలకు గురయ్యాడు. దీంతో నెక్ట్స్ మూవీ ఖైదీ 2 చేస్తే అంతగా బజ్ క్రియేట్ అవ్వదు అనుకున్నాడేమో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఈ మల్టీస్టారర్ లో రజినీకాంత్, కమల్ హాసన్ నటిస్తారని సమాచారం. వీరిద్దరికీ లోకేష్‌ కనకరాజ్ కథ చెప్పడం.. కథ విని ఇద్దరూ సూపర్ స్టార్స్ ఓకే చెప్పడం జరిగిందని న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ మూవీని కమల్ హాసన్ తన బ్యానర్ లో నిర్మించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. రజినీ, కమల్ ఇద్దరూ స్టార్ హీరోలు అవ్వక ముందు కలిసి నటించారు. స్టార్ట్స్ అయిన తర్వాత కలిసి నటించలేదు. ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు వెళ్తే పెద్ద సెన్సేషన్ అవుతుంది.

Share your love