మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రానికి మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ లో సెక్యూరిటీతో మెగాస్టార్ నడిచివస్తున్న సీన్ తో పాటు రైఫిల్ తో మెట్లు దిగుతున్న షాట్స్ కట్ చేశారు. రౌడీ అల్లుడు సినిమా బీజీఎంతో డిజైన్ ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేలా ఉంది.
మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ కింద పండగ కి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో టైటిల్ బాగా పెద్దగా తయారైంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈ టైటిల్ గ్లింప్స్ తో మరోసారి మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇటీవల ఈ సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి షైన్ స్క్రీన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్న ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా మరో కీ రోల్ లో కనిపించనుంది.





