Koushik Reddy: కొంపముంచిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అమ్ముడుపోయిన ఎనిమిది మంది ఎంపీలు?

koushik reddy

Koushik Reddy: ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. అటు కాంగ్రెస్ కూటమి నిలబెట్టిన అభ్యర్థి దారుణంగా ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికపై తాజాగా గులాబీ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమ్ముడుపోయి బిజెపి అభ్యర్థిని గెలిపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Koushik Reddy comments on congress vice president elections

తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చానని.. ఈ విషయంపై ఢిల్లీలో ఉన్న ఓ కాంగ్రెస్ నేతకు నేను ఫోన్ చేశానని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు మొత్తం 15 మంది అమ్ముడుపోయినట్లు… తనకు ఢిల్లీ నేతలు చెప్పినట్లు స్పష్టం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 8 మంది ఎంపీలు కూడా అమ్ముడుపోయినట్లు తేలిందని కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Also Read: Sleeping Pills: నిద్ర కోసం మాత్రలు వాడుతున్నారా…అయితే ప్రమాదమే ?

దీంతో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయిందని.. కౌశిక్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. దీని అంతటికి కారణం రేవంత్ రెడ్డి అన్నట్లుగా మాట్లాడారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎవరు అమ్ముడు పోలేదని తెలిపారు. ఇదంతా ఫేక్ ప్రచారమని మండిపడ్డారు.

Also Read: Water Cane: ఒకే వాటర్ క్యాన్ చాలా రోజులు వాడుతున్నారు…అయితే జాగ్రత్త?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu