
OG Movie: గత కొంతకాలంగా ఏ సినిమాకు లేని హైప్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ (OG) సినిమాకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే, అభిమానుల అంచనాలు విపరీతంగా పెరిగాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ proper commercial entertainer లో నటిస్తుండటంతో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరుగుతోంది.
OG Movie Fans Excited Analysis
సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే ఈ సినిమాకు ఇటీవలే ట్రైలర్ విడుదల చేశారు. చెప్పిన సమయానికి రాకపోవడం వల్ల కొంతమంది ఫ్యాన్స్ నిరాశ చెందారు, కానీ ట్రైలర్ విడుదల తర్వాత అది సోషల్ మీడియాలో viral sensationగా మారింది. అభిమానులు ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్రైలర్ విశ్లేషణ ప్రారంభించారు.
నెటిజన్ల విశ్లేషణలో “వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్” బోర్డు కనిపించింది. దీనిని చూసి కొందరు OG, సుజిత్ గత చిత్రం సాహోకి లింక్ ఉందని చెబుతున్నారు. మరికొందరు ప్రభాస్ cameo ఉంటుందనే పుకార్లను సృష్టిస్తున్నారు.
అయితే, ‘ఇన్సైడ్ టాక్’ ప్రకారం OG, సాహో సినిమాలు cinematic universeలో భాగమే అయినా, ప్రభాస్ క్యామియో ఉండకపోవచ్చని, OG కలెక్షన్‌కు ఇబ్బందులు రాకపోవచ్చని సమాచారం ఉంది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచే OG ప్రీమియర్ షోల కోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు ఇప్పుడు OGపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.




Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!