
Raasi: సీనియర్ నటి రాశి తన సినీ కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నట్టు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కొన్ని పాత్రలను వదులుకుందట. అందులో ఎంతో హిట్ అయినా ఒక సినిమా కూడా ఉంది అదే రంగస్థలం..
Raasi sensational comments about anasuya
రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో చేసే అవకాశం మొదట రాశిని వరించింది.కానీ రాశి రంగమ్మత పాత్రలో అంత బోల్డ్ గా నటించలేనని చెప్పి రిజెక్ట్ చేసిందట.మొదట డైరెక్టర్ సుకుమార్ రాశిని పిలిచి స్టోరీ మొత్తం చెప్పారట. మీ పాత్ర ఇలా ఉంటుంది అని వివరించారట.(Raasi)
Also Read: Niharika: లావణ్య త్రిపాఠి ఎంట్రీ తో నిహారిక బయటికి.. నాగబాబు ఇంట్లో ఏం జరుగుతోంది.?
కానీ కెమెరా ముందు స్నానాలు చేయడం,మందు తాగడం వంటి సీన్స్ లో తాను సరిగ్గా నటించలేనని,ఒకవేళ తాను ఆ సీన్స్ లో నటించినా కూడా ప్రేక్షకులు ఒప్పుకోలేరని, నాది సింపతి ఫేస్ కాబట్టి నన్ను ప్రేక్షకులు అలాంటి పాత్రల్లోనే చూస్తారు.ఇలాంటి పాత్రలు చేస్తే అస్సలు ఆదరించారు. అందుకే సార్ నేను ఈ సినిమాలో నటించలేను అని రాశి రిజెక్ట్ చేసిందట.

ఇక రాశి రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర అనసూయ కి వెళ్ళింది. అలా అనసూయ రంగమ్మత్త పాత్రతో తన సినీ కెరియర్ మార్చుకుంది.ఈ సినిమా తర్వాత అనసూయ కి పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త అనే కీ రోల్ పోషించింది. అంతేకాదు చివర్లో సర్పంచ్ పాత్రలో కూడా మెరిసింది.(Raasi)





