
Revanth Reddy: రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలు తిరగబడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు…రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లారు రేవంత్ రెడ్డి. Revanth Reddy
kodangal people serious on Revanth Reddy
ఈ నేపధ్యంలో పరిగిలోని కొడంగల్ చౌరస్తా వద్ద గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వాహనదారులు. రాత్రి 10 గంటలకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవ్వడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. Revanth Reddy
Also Read: Jammi Chettu: దసరా నాడు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేస్తారు.. దీని రహస్యం
ఈ టైంలో పండగ పూట మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ రేవంత్ రెడ్డి మరియు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొడంగల్ ప్రజలు. మీకు దండం పెడుతాము.. మేము కూడా అన్నీ వదులుకొని ఇక్కడే రోడ్డు మీద ఉన్నాము అంటూ జనాలకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. Revanth Reddy
Also Read: PCB Chief Mohsin Naqvi: బీసీసీఐకి భయపడని మొహ్సిన్ నఖ్వీ.. ఏం చేస్తారో చేసుకోండి…





