Aditi Rao Hydari: పదేళ్లు కలిసున్న భర్తకి అదితి రావు హైదరీ విడాకులు ఇవ్వడానికి కారణం.?

The reason why Aditi Rao Hydari divorced her first husband

Aditi Rao Hydari: అదితీ రావు హైదరి.. మోడల్ గా తన కెరీర్ ని మొదటి పెట్టి బాలీవుడ్లో పలు సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా హీరోయిన్ గా రాణించిన అదితి రావు హైదరి సౌత్ లో సినిమాల కంటే ఎక్కువగా సిద్ధార్తథ్ ని పెళ్లి చేసుకున్న విషయంతోనే పాపులర్ అయింది.. మహాసముద్రం సినిమా సమయంలో కలిసిన వీరి బంధం పెళ్లి వరకు దారితీసింది.

The reason why Aditi Rao Hydari divorced her first husband

అయితే సిద్ధార్థ్, అదితి రావు హైదరీలు ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లే. ఇక సిద్ధార్థ్ విషయం పక్కన పెడితే..అదితీ రావు హైదరి మొదటి పెళ్లి విషయం చాలామందికి తెలియదు. ఆమె మొదట పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలకు పైగా భర్తతో కలిసి ఉంది. కానీ 10 ఏళ్ల వీరి వైవాహిక బంధం లో ఎలాంటి గొడవలు వచ్చాయో తెలియదు .(Aditi Rao Hydari)

Also Read: Niharika: ఆ హీరోతో నిహారిక రొమాన్స్.. “ఇలాంటి వీడియోలకే నీ మొగుడు వదిలేసాడంటూ ఫైర్.!

కానీ మొదటి భర్తకు అదితి రావు హైదరీ విడాకులు ఇచ్చేసింది.మొదటి భర్త పేరు సత్య దీప్ మిశ్రా.. వీరు 2002లో పెళ్లి చేసుకుని 2012లో విడిపోయారు. అలా విడాకుల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అదితీరావు హైదరి స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అయితే పదేళ్లు కలిసి ఉన్న సత్య దీప్ మిశ్రా అదితి రావు హైదరీ ల మధ్య గొడవలకు కారణం అదితి మోడలింగ్ రంగంలోకి వెళ్తానని చెప్పడమేనని,

The reason why Aditi Rao Hydari divorced her first husband

అందువల్లే ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారని అప్పట్లో ఓ రూమర్ వినిపించింది. కానీ ఇప్పటివరకు అదితి తన మొదటి పెళ్లి విడాకులకు సంబంధించి వార్తలపై ఎక్కడా కూడా స్పందించలేదు. ఇక గత ఏడాది సిద్ధార్థ్ ని పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది.(Aditi Rao Hydari)

Share your love