
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ రాజకీయాల కొనసాగుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఈ ఎన్నిక ఫలితం రిలీజ్ అవుతుంది.గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll Naveen Yadav jumps into BRS after winning
భారతీయ జనతా పార్టీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. గులాబీ పార్టీ మూలాలు ఉన్న నవీన్ యాదవ్… జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలిచిన తర్వాత కెసిఆర్ చెంతకు చేరుతాడు అని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో ఒక్క లీడర్ కూడా ఉండడని.. అందులో భాగంగానే నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ పార్టీలోకి జంప్ అయ్యే ఛాన్స్ లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Jubilee Hills Bypoll
Also Read: Ravi tree: రావి చెట్టును పొరపాటున కూడా మీ ఇంట్లో పెంచుకోవద్దు.. లేదంటే దరిద్రం…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పెద్దగా నెరవేరలేదని గ్రౌండ్ రిపోర్టు స్పష్టం చేస్తోందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీలో వైసీపీ ఓడినట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి పాలు కావడం గ్యారెంటీ అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఇలాంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నవీన్ యాదవ్ కూడా గులాబీ పార్టీలోకి జంప్ అవుతాడని చెబుతున్నారు. గెలిచిన వెంటనే వెళ్లకపోయినా 2028 లోపు జంప్ అవుతారని చెబుతున్నారు.Jubilee Hills Bypoll
Also Read: Alcohol: ఆకలితో ఉన్నప్పుడు మద్యం సేవిస్తున్నారా…అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి?





