
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ముస్లింలు తిరుగుబాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముస్లిం పెద్దలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పై ముస్లిం ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll Muslim Imam is extremely angry with Revanth Reddy
రేవంత్ రెడ్డి బెవకూఫ్.. ముస్లింలు ఉన్నందుకే కాంగ్రెస్ ఉందని కౌంటర్ ఇచ్చారు ముస్లిం ఇమామ్.
ముస్లిం ఓట్ల పునాది మీద నీ కాంగ్రెస్ పార్టీ ఉంది.. నీకు దమ్ముంటే రేపు ఎన్నికలు పెట్టు, సీఎం సీటు నీకు కల అవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి బలుపు తలకెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. ముస్లింలు ఇజ్జత్‌తో బతుకుతారు.. ఇజ్జత్ కోసం చావనైనా చస్తారని బాంబ్ పేల్చారు. Jubilee Hills Bypoll
Also Read: BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?
ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మొన్న రోడ్ షో చేసిన సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారు.. కాంగ్రెస్ వల్లే ముస్లింలు బతుకుతున్నారు అన్న రేంజిలో సీఎం రేవంత్ రెడ్డి హిందీలో స్పీచ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉందని.. కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీరు అసలెందుకు పనికిరారు అంటూ రెచ్చిపోయారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే అంశం సీఎం రేవంత్ రెడ్డి కి షాక్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ముస్లింలు తిరుగుబాటు చేసే ప్రమాదం పొంచి వచ్చింది. దీని ఎఫెక్టు జూబ్లీహిల్స్ చూపియండి ఇకపై ఉండే అవకాశాలు ఉన్నాయి. Jubilee Hills Bypoll
Also Read: Jubilee Hills bypoll: మాగంటి గోపీనాథ్ కు అసలైన వారసులం మేమే..కాంగ్రెస్ స్కెచ్ అదుర్స్…





