
YCP: నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 కు ఘోర అవమానం జరిగింది. రిలీజ్ అవుతుందన్న ఒక్కరోజు ముందుగానే వాయిదా పడిపోయింది. ఇప్పటివరకు ఏ సినిమాకు ఎదురు కానీ పరిస్థితి నందమూరి బాలయ్య హీరోగా చేసిన అఖండ 2 సినిమాకు ఎదురయింది. మహేష్ బాబు నటించిన రెండు సినిమాల కారణంగా పాత బకాయిలు eros సంస్థకు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సి ఉందట. YCP
Akhanda 2 is a great insult YCP is taking away the honor
అయితే ఆ డబ్బులు ఇప్పుడు వసూలు చేసేందుకు eros ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే, అఖండ 2 సినిమా ప్రీమియర్లు నిన్న అర్ధరాత్రి ఆగిపోయాయి. ఇవాళ రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా విడుదల కూడా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు మళ్లీ రిలీజ్ అవుతుందో అనే టెన్షన్ లో అభిమానులు అందరూ ఉన్నారు. అటు సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 ఉంటుందని మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. YCP
Also Read: Revanth Reddy: సీఎం రేవంత్ కు జర్నలిస్ట్ వెన్నుపోటు..బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ గా ?
ఇలాంటి నేపథ్యంలో వైసిపి ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా నందమూరి బాలయ్య సినిమాలకు అవమానం జరుగుతోందని కౌంటర్ ఇస్తోంది. నందమూరి బాలయ్యను బకరా చేసేందుకే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చురకలాంటిస్తోంది వైసిపి. బాలయ్య సినిమా ఇంత అగాధంలో పడిన కూడా, సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం పట్టించుకోవడంలేదని సెటైర్లు పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ చీమకుట్టినట్లు కూడా లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఇలాంటి అవమానం ఏ హీరోకు జరగలేదని గుర్తు చేస్తున్నారు. YCP
Also Read: Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్న పవన్ కళ్యాణ్ ?





