Anirudh Reddy: నా సొంత ఊరి వాళ్ళే నన్ను ఓడించి నా గుండెల మీద కొట్టిర్రు ?

Anirudh Reddy
Anirudh Reddy

Anirudh Reddy: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. మొన్న జరిగిన మొదటి విడత లోకల్ బాడీ ఎన్నికల్లో సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన బాధపడుతూ మాట్లాడారు. నా సొంత ఊరు వాళ్లే నన్ను ఓడించి నా గుండెల మీద కొట్టారని ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. దీంతో అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. Anirudh Reddy

Anirudh Reddy comments on his own village rangareddy gudem

తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత ఊరు రంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ అభ్యర్థి దారుణంగా ఓటమిపాలయ్యాడు. కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిపై బిజెపి మద్దతు అభ్యర్థి గ్రాండ్ విక్టరీ సాధించాడు. స్వయంగా అనిరుద్ రెడ్డి ప్రచారం చేసినప్పటికీ బిజెపి పార్టీని గెలిపించారు రంగారెడ్డిగూడెం గ్రామస్తులు. అయితే ఈ ఓటమిపై తాజాగా అనిరుద్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. సొంత గ్రామస్తులే తన గుండెలపై తన్నారని పేర్కొన్నారు. Anirudh Reddy

Also Read: Sravani Chowdary: అఖండ 2 సినిమాకు ఒకే రోజు రూ.200 కోట్లు..ఆడుకుంటోన్న వైసీపీ ?

గులాబీ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కుమ్మక్కు తనను టార్గెట్ చేశాయని మరో సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఇలా ఉండగా అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో జనసేన పార్టీ అతన్నీ ట్రోల్ చేస్తోంది. సొంతంగా గెలవలేడని ఈ పవన్ కళ్యాణ్ ను గత 15 రోజుల కిందట అనిరుద్ రెడ్డి విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు అనిరుద్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన స్పందిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో నీ సొంత గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయావ‌ని అనిరుద్ రెడ్డికి జనసేన కౌంటర్ ఇస్తోంది. Anirudh Reddy

Also Read: Akhanda 2: వైసీపీ రెక్క‌లు విరిచేసిన బాల‌య్య‌..అఖండ 2 సినిమాలో అదిరిపోయే సీన్ ?

Share your love