

Aroori Ramesh: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. ఇక రేపు కెసిఆర్ సమక్షంలో మళ్లీ గులాబీ గూటికి ఆరూరి రమేష్ రాబోతున్నట్లు తెలుస్తోంది. Aroori Ramesh
aroori ramesh will joins in BRS Party
కెసిఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ సొంతగూటికి వస్తున్నారు ఆరూరి రమేష్. ఈ విషయాన్ని స్వయంగా ఆరురి రమేష్ కూడా వెల్లడించారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూనే తాను గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల కంటే ముందు గులాబీ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి, అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు ఆరూరి రమేష్. అయితే ఇప్పుడు మళ్లీ గులాబీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో సొంత గూటికి వస్తున్నారు. Aroori Ramesh
Also Read: TDP: వైసీపీ నాయకులతో మాట్లాడితే.. పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను
ఆరూరి రమేష్ ఒక్కడే కాదు, ఇటీవల అలాగే ఎలక్షన్స్ కంటే ముందు బిజెపి పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి ఇలాంటి లీడర్లు కూడా ఘర్ వాపస్ అవుతున్నారట. అతి త్వరలోనే ఈటల రాజేందర్ కూడా రాబోతున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే కెసిఆర్ తో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారట బిజెపి నేతలు. కాంగ్రెస్ కంటే ముందు బిజెపిని కతం చేయాలని కేసిఆర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Aroori Ramesh
Also Read: Rajagopal Reddy: వైన్స్ విషయంలో పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి?






