DONALD TRUMP : డొనాల్డ్ ట్రంప్ ప్ర‌భుత్వానికి షాక్.. ఫెడ‌ర‌ల్ కోర్టు సంచ‌ల‌న తీర్పు..!

Donald Trump

DONALD TRUMP : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌వేశ‌పెట్టిన కీల‌క వ‌ల‌స విధానానికి అమెరికా ఫెడ‌ర‌ల్ కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. వ‌ల‌స‌దారుల‌ను వారి స్వ‌దేశాల‌కు కాకుండా.. మూడో దేశాల‌కు బ‌ల‌వంతంగా పంపించివేసే విధానం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని అమెరికా ఫెడ‌ర‌ల్ జ‌డ్జీ తీర్పును ఇచ్చారు. వ‌ల‌స‌దారుల‌ను ఏ దేశానికి పంపిస్తున్నారో వారికి ముందుగా తెలియ‌జేయ‌కుండా ఆ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేసే అవ‌కాశం క‌ల్పించ‌కుండా పంపించ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని జ‌డ్జీ బ్రియాన్ మార్ఫీ స్ప‌ష్టం చేసారు.

SHOCK TO DONALD TRUMP GOVERNMENT.. FEDERAL COURT JUDGEMENT ON THE MATTER

అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం.. ఏ వ్య‌క్తికి అయినా ల‌భించే డ్యూ ప్రాసెస్ చ‌ట్ట‌ప‌ర‌మైన స‌రైన ప్ర‌క్రియ హ‌క్కును ఈ విధానం ఉల్లంఘిస్తోంద‌ని 81 పేజీల తీర్పులో పేర్కొన్నారు. వ‌ల‌స‌దారుల‌కు సంబంధం లేని దేశాల‌కు వారిని పంపించ‌డం వ‌ల్ల వారి ప్రాణాల‌కు ముప్పు వాటిల్లే అవ‌కాశ‌ముంద‌ని.. ఇది మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న కింద‌కి వ‌స్తుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

Also Read : MODI-NETANYAHU : కాషాయం రంగు గురించి నెత‌న్యాహు ఫ‌న్నీ రియాక్ష‌న్..!

ఈ తీర్పు పై ప్ర‌భుత్వం అప్పీలు చేసుకునేందుకు వీలుగా జ‌డ్జీ త‌న ఉత్త‌ర్వుల అముల‌పై 15 రోజుల పాటు స్టే విధించారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌రిహ‌ద్దుల వ‌ద్ద క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధించింది ప్ర‌భుత్వం. వారి సొంత దేశాల‌కు కాకుండా.. ఒప్పందాలు కుదుర్చుకున్న ఇత‌ర దేశాల‌కు పంపించే ప్ర‌క్రియ ను ప్రారంభించింది. ఈ విష‌యం పై మాన‌వ హ‌క్కుల సంఘాలు కోర్టులో స‌వాల్ చేశాయి. వారికి అనుకూలంగా తాజాగా అమెరికా ఫెడ‌ర‌ల్ కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

Also Read : AP HIGH COURT : ఏపీ సీఎస్ విజ‌యానంద్ పై హైకోర్టు సీరియ‌స్.. ఎందుకంటే..?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment