
KTR : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవలే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నెలల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఖమ్మం జిల్లాలో వెలుగుమెట్లలో పేదల ఇళ్లు కూల్చివేయడంతో ప్రజలు రోడ్డున పడ్డారు. వారికి మరోచోట స్థలం కేటాయించి ప్రభుత్వం గృహాలు నిర్మిస్తామని చెప్పినప్పటికీ.. అదంతా జరిగే లోపు సమయం పడుతుందని అక్కడి ప్రజలు ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు.
FORMER MINISTER KTR PARTICIPATED MUSI DANDI MARCH PROGRAM
మరోవైపు మూసీ నది పై కూడా కూల్చివేతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా హైదర్‌షాకోట్‌లో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మూసీ సుందరీకరణ వల్ల నష్టపోతున్న బాధితులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాదయాత్ర చేశారు. “మూసీ దండి మార్చ్” సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక్క ఇళ్లు కూల గొట్టకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5 కిలోమీటర్లు మూసీ సుందరీకరణ చేశామని తెలిపారు.
Also Read : AMBATI RAMBABU :ఆ వైసీపీ నేతతో కాపులు టచ్ లోకి
ఇళ్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయలేరా అని మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాలి అని ప్రజలకు చెప్పారు. రూ.16 వేల కోట్లతో అయిపోయేదానికి రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక కాకికి నొప్పి కలిగితే మిగతా కాకులన్నీ ఎట్లా వాలుతాయో.. ఎక్కడ కూల్చివేతలు జరిగిన మన అందరం కలిసి కొట్లాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి మీరు ఓటు వేయలేదనే కోపంతో హైదరాబాద్‌లో లక్షా యాభై వేల ఇండ్లు కూల్చడానికి సిద్ధం అవుతున్నాడు. కాబట్టి మీరంతా ఐకమత్యంగా కలిసి ఉండాలని కోరుతున్నానని తెలిపారు.
Also Read : IRAN-ISRAEL WAR : ప్రధాని మోడీ పర్యటన పై ఒవైసీ సెన్షేషన్ కామెంట్స్





