మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టు ఆపరేషన్ ఈ రోజు విజయవంతంగా జరిగింది. ఇటీవల పెద్ది సమయంలో గాయపడిన చరణ్, తన సినిమా రిలీజ్, ప్రమోషన్స్ కారణంగా ఈ సర్జరీని వాయిదా వేశారు. చివరకు కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్ లో ఈ ఆపరేషన్ జరిగింది.
Ram Charan Wrist Surgery Success
చరణ్ తన ఫ్యామిలీతో నిన్న హాస్పిటల్ కు వెళ్ళారు. ఈ ఉదయం డాక్టర్ రాజశేఖరన్ టీమ్, అమెరికా స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బేడియా కలిసి క్లిష్టమైన సర్జరీ చేశారు. ప్రస్తుతం చరణ్ పూర్తి వైద్య పర్యవేక్షణలో హాస్పిటల్ లోనే రికవరీ అవుతున్నారు.
రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే chance ఉంది. ఆ తర్వాత డాక్టర్లు సూచించినట్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. దీంతో అభిమానులు చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ ఆపరేషన్ వల్ల చరణ్-సుకుమార్ సినిమా మరింత ఆలస్యమయ్యే possibility ఉంది.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848




