
HARISH RAO : మున్సిపల్ ఎన్నికల్లో హద్దులు దాటి అతి చేసిన పోలీసులను వదిలి పెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వచ్చేసారి అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ గారి కాళ్లు మొక్కయినా సరే అతి చేసిన పోలీసుల సంగతి అంతు చూసే వరకు విడిచిపెట్టేది లేదన్నారు. ముఖ్యంగా ఎక్స్ ట్రాలు చేసిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకుంటున్నామని తెలిపారు. HARISH RAO
there-is-no-question-of-letting-go-of-the-police-who-have-done-too-much-in-the-municipal-elections-harish-rao
రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. అన్ని డైరీలో రాసి పెట్టుకున్నట్టు తెలిపారు. మొన్న తమ్ముడు బాల్క సుమన్ ను ఆదిలాబాద్ జైలులో పెట్టారు.
Also Read : Sridhar Rao : ఈనాడు ఉద్యోగికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ?
బాల్క సుమన్ తో పాటు నలుగురిని క్యాతన్ పల్లికి చెందిన వారిని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలులో ఉంచారు. మెదక్ లో 13 మందిని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలులో పెట్టారు. ఆమనగల్ లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.
Also Read : Cable Bridge : కేబుల్ బ్రిడ్జ్ లైట్లు దొంగల పాలు..!





