
Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తాజాగా మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే గత కొద్దిరోజుల ముందే ఆయన మరణించినట్టు ఎన్నో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.దాంతో చివరికి ధర్మేంద్ర కుటుంబ సభ్యులు ధర్మేంద్ర చనిపోలేదని, ఆయన ఐసియుల చికిత్స తీసుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలియజేశారు.
Dharmendra passed away
అంతే కాదు ధర్మేంద్ర భార్య హేమమాలిని,ధర్మేంద్ర కూతురు ఇషా డియోల్ మాత్రం ధర్మేంద్ర మరణ వార్తలపై మండి పడుతూ ఇలాంటి తప్పుడు వార్తలు రాయకండి అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ధర్మేంద్ర కోలుకొని ఇంటికి కూడా వెళ్లారు. ఇంటి దగ్గర ఆయనకు కొన్ని ట్రీట్మెంట్లు ఇచ్చారు. (Dharmendra)
Also Read: iBOMMA Ravi: “మామ హైదరాబాద్ వచ్చా.. కలిసి తాగుదాం”..రవి ఇలా దొరికిపోయాడా ?
కానీ సడన్గా మళ్లీ ఈరోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చివరికి మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆ మధ్యకాలంలో ముంబైలోని క్యాండీ హాస్పిటల్ లో చేరారు.ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన పది రోజులకే మళ్ళీ శ్వాస తీసుకోవడానికి రాకపోవడంతో చివరికి మరణించారు.

ఇక ధర్మేంద్ర మరణ వార్త విని ఎంతో మంది ఆయన అభిమానులు,కుటుంబ సభ్యులు,సినీ సెలబ్రిటీలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ఆయన భౌతిక దేహానికి నివాళులు అర్పించడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.(Dharmendra)





