BRS: మున్సిప‌ల్ ఎన్నిక‌లు..బీఆర్ఎస్ ఓటు షేర్ డ‌బుల్..ఎంతంటే ?

BRS: మున్సిప‌ల్ ఎన్నిక‌లు..బీఆర్ఎస్ ఓటు షేర్ డ‌బుల్..ఎంతంటే ?
Municipal elections BRS vote share doubles what does it mean
Municipal elections BRS vote share doubles what does it mean

BRS: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్మురేపింది. పార్టీ పనైపోయిందన్న విమర్శలకు చెక్ పెడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుమ్మురేపింది. పార్లమెంట్ ఎన్నికల్లో 17% ఓటు షేర్ నుంచి నేడు 30% ఓటు షేర్‌కి చేరుకుంది బీఆర్ఎస్ పార్టీ. 15 మున్సిపాలిటీలు, 723 వార్డుల్లో గెలిచి.. 36 మున్సిపాలిటీల్లో హంగ్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. BRS

Municipal elections BRS vote share doubles what does it mean

అధికార కాంగ్రెస్ పార్టీని కేవలం 52% వార్డులకే పరిమితం చేసి ప్రతిపక్షంగా సూపర్ సక్సస్ అయింద‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్లు రావడంతో పార్టీ పని అయిపోయిందని మీడియా నెరేటివ్స్ చేశారు. అలాంటివి లెక్క చేయకుండా..ఎప్పటికప్పుడు ఫలితాలతో పార్టీ క్యాడర్ తిప్పికొడుతోంది. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది బీఆర్ఎస్. BRS

Also Read: KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం

బీ టీం అని ముద్ర వేయాలని ప్రయత్నించిన రెండు జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ ఝలక్ ఇచ్చింది. పోలీసుల అంగబలం… అధికార ప్రభావం, ఆర్థిక శక్తిని గట్టిగా ఎదురుకున్నారు గులాబీ శ్రేణులు. పెద్దగా ప్రచారం చేయకుండా వచ్చిన ఫలితాలు చూసి బీఆర్ఎస్ క్యాడర్‌లో జోష్ పెరిగింది. గులాబీ బాస్ రంగంలోకి దిగకుండానే బీఆర్ఎస్‌ని కేటీఆర్, హరీష్ రావులు నిలబెడుతున్నారు. BRS

Also Read: Telangana: రేవంత్ స్కెచ్‌..తెలంగాణలో ఆ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ?