KTR: శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి చెక్‌..బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే అభ్య‌ర్థిని సెట్ చేసిన కేటీఆర్ !

KTR
KTR

KTR: శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీకి చెక్‌..బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే అభ్య‌ర్థిని సెట్ చేశార‌ట‌ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో విజయ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. అనంత‌రం కేటీఆర్ మాట్లాడుతూ…విజయ్ కుమార్ రెడ్డి చదువుకున్న యువకుడు పార్టీలోకి రావడం సంతోషదాయకం అన్నారు. KTR

Vijay Kumar Reddy joined the party in the presence of KTR

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీ మారిన, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉన్నారని వెల్ల‌డించారు. ఎమ్మెల్యే లేనప్పటికీ హైదరాబాద్ మొత్తంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ బలంగా ఉందని వివ‌రించారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీ చేసింది ఏం లేదు, పూజకి పనికిరాని పువ్వు బీజేపీ అంటు ఫైర్ అయ్యారు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి అని పెద్దలు చెప్తారన్నారు. అందుకే ఈ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష బీఆర్ఎస్ మాత్రమేన‌ని వివ‌రించారు. KTR

Also Read: Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒకే ఒక విషయం చెప్పానని తెలిపారు. ఓటు ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలో ఆలోచన చెయ్యండని కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌ను ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానేన‌ని స్ప‌ష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కొందరు నాయకులు పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉన్నారన్నారు. KTR

Also Read: Dharmapuri Arvind: మాకు ఎవ్వడి మద్దతు అవసరం లేదు ?

Share your love