
Free bus effect: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఫ్రీ బస్సు పథకానికి చంద్రబాబు నాయుడు సర్కార్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ఏపీ ప్రజలు చాలా బ్రహ్మాండంగానే వినియోగించుకుంటున్నారు. కానీ ఈ పథకం పై ఏపీ ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు మాత్రం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ లేడీ కండక్టర్ వీడియో బయటకు రావడంతో ఈ విషయం బయటపడింది.
Free bus effect a lady conducter video goes viral
ఫ్రీ బస్సు కారణంగా… మహిళలు విపరీతంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆ కండక్టర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఉద్యోగాలు తమకు వద్దే వద్దు అంటూ… సదరు లేడీ కండక్టర్ ఎమోషనల్ అయింది. పరిమితికి మించి ప్యాసింజర్లు ఎక్కువగా బస్సులో ప్రయాణించడంతో… సీట్లు దక్కకపోవడంతో తమను… ప్రజలు దారుణంగా తిడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అలాగే కనీసం మర్యాద లేకుండా ప్రయాణికులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Kim Jong-Un: కిమ్ ఎంతకు తెగించాడురా…. సినిమా షేర్ చేసినందుకు అందర్నీ చంపేశాడు… మొత్తం 300 మంది ?
మహిళా కండక్టర్లకు ఈ ఫ్రీ బస్సు కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఎవరు చెప్పలేని బాధలను తాము అనుభవిస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత బస్సు వల్ల తమ బ్రతుకు హీనంగా మారిందని ఎమోషనల్ అయ్యారు. ఈ బస్సులోనే ప్రాణాలు పోయేలా ఉన్నాయని మహిళా కండక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేకే సర్వే… ఆ పార్టీదే గ్రాండ్ విక్టరీ ?




















