iBomma: అల‌ర్ట్‌… iBomma వాడే వారికి షాక్ ?

iBomma: ఐ బొమ్మ చూసే వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఊహించని షాకించారు. ఐ బొమ్మ వినియోగదారులు… ఇకపై దాన్ని వాడకూడదని తాజాగా హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐ బొమ్మ హెడ్ ను కూడా పట్టుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఐ బొమ్మ పై తాజాగా సివి ఆనంద్ మాట్లాడుతూ… దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి సినిమాలను పైరసీ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

hyderabad cv anand warns iBomma

ఎంతో ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే తెల్లవారి కాకముందే సినిమాలను ఐ బొమ్మలో పెట్టేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల కోట్లల్లో నిర్మాతలకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ ముఠాను త్వరలో పట్టుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో ఓటీపీ పైరసీ కంటెంట్ సైట్ అయిన ఐ బొమ్మను కూడా.. క్లోజ్ చేస్తామని కూడా తెలిపారు.

Also Read: Telangana local body poll: స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల… తేదీలు ఇవే

ఇప్పటికే దానికి సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని గుర్తు చేశారు. దేశంలో తొలిసారి భారీ ఎత్తున పైరసీ మూటను పట్టుకున్నామని స్పష్టం చేశారు హైదరాబాద్ సివి ఆనంద్. ఇందులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇదే ప్రధాన పాత్ర అని వెల్లడించారు. త్వరలో ఐ బొమ్మ నిర్వాహకులు అందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తామని హెచ్చరించారు. ఈ ఐ బొమ్మ ద్వారా సినిమాలు చూడకూడదని సూచనలు చేశారు.

Also Read: Janasena MLA: జర్నలిస్టులకు వార్నింగ్…వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా !

Share your love