
Varanasi: వారణాసి మూవీ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా నిర్వహించారో చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సినిమా టైటిల్ రివీల్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ ని ఏ సినిమా కోసం ఏర్పాటు చేయలేదు. అలాంటిది మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమా కోసం ఒక పెద్ద ఈవెంట్ ని నిర్వహించి భారీ ఎత్తున సినిమా టైటిల్ ని,గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
The entire Varanasi event was done by that director
అయితే ఈ సినిమా ఈవెంట్లో రాజమౌళి మహేష్ బాబులు కాకుండా ఓ డైరెక్టర్ పేరు తెగ హైలెట్ గా మారింది.అదే పూరి జగన్నాథ్.. వారణాసి మూవీ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ బాబులు మెయిన్ అయినప్పటికీ వీరిద్దరూ కాకుండా ఎక్కువగా పూరి జగన్నాధ్ జపం చేశారు చాలామంది ఈవెంట్ కి వచ్చిన వాళ్ళు.ముఖ్యంగా ఈ మూవీకి సంగీతం అందిస్తున్న కీరవాణి పోకిరి సినిమా డైలాగ్ లెవెల్ లో ఓ డైలాగ్ చెప్పారు.(Varanasi)
Also Read: Balakrishna: బాలయ్య నువ్ ఇక మారవా.. సోషల్ మీడియాలో ట్రోల్స్.!
అంతేకాకుండా మహేష్ బాబు కి విలన్ గా నటిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నేను తెలుగులో చూసిన మొట్టమొదటి ఫిలిం పోకిరి అంటూ మరోసారి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాని తలుచుకున్నారు. అలా ఈ సినిమా ఈవెంట్లో మహేష్ రాజమౌళిలు కాకుండా పూరి జగన్నాథ్ పేరు హైలెట్గా మారింది. అంతేకాదు ఈ సినిమాకి డైలాగులు రాస్తున్న దేవకట్టా కూడా పోకిరి మూవీ డైలాగ్స్ చెప్పారు.

యాంకర్ సుమా కనకాల మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఏ డైలాగ్ ఇష్టం అని అడగగా..ఎవడు కొడితే దిమ్మతిరిగే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అనే డైలాగ్ చెప్పి మరోసారి పూరి జగన్నాథ్ ని గుర్తు చేశారు. ఇక మహేష్ బాబు పూరి జగన్నాధ్ మూవీ డైలాగులు యాజిటీజ్ చెప్పకపోయినప్పటికీ అక్కడక్కడ పోకిరి మూవీ డైలాగ్స్ అటు ఇటుగా చెప్పారు.అలా టోటల్ గా వారణాసి మూవీ ఈవెంట్ అయినప్పటికీ పోకిరి మూవీ ప్రభావమే ఇందులో ఎక్కువగా కనిపించింది.(Varanasi)





