
Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా అంటూ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. Jeevan Reddy
Jeevan Reddy Resign to Congress
భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు, అవమానాలు ఇంకెంత కాలం భరించాలని నిలదీశారు. ఈ ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్కు రాసిచ్చారా? అంటూ నిలదీశారు. Jeevan Reddy
Also Read: BRS: బుల్లెట్ దిగిందా లేదా? గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారని ఫైర్ అయ్యారు. స్పీకర్ ఏమో ఎమ్మెల్యే పార్టీ మారలేదు అంటున్నాడు.. ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడని నిలదీశారు. అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని కోరారు. జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా వుందో? అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. Jeevan Reddy
Also Read: BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక..బీఆర్ఎస్ కు ఊహించని షాక్




















