
NARA LOKESH : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ ప్రశంసలు కురిపించింది. ఇటీవలే లోకేష్ తీసుకున్న ఓ నిర్ణయం పై ఆమె సోషల్ మీడియా వేదిక గా స్పందించింది. ఈ మేరకు జాన్వీ కపూర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
HEROINE JANHVI KAPOOR PRAISED NARA LOKESH
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక SMA టైప్-1 అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధుపడుతున్న విషయం తెలిసిందే. ఈ జబ్బు సోకిన వారి కండరాలు క్రమ క్రమంగా బలహీన పడి..శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. చికిత్సలో భాగంగా ఈ పాపకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్గెన్స్మా’ అనే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఈ ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16కోట్లు ఉంటుంది. అంత స్తోమత లేని తల్లిదండ్రులు దాతలను ఆశ్రయించారు. తమ కూతురు చికిత్స కోసం ఆర్థిక సాయం అందించి కాపాడాలని వారు కోరారు.
Also Read : RAGHURAMA KRISHNA RAJU : క్రికెట్ ఆడుతుండగా ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు గాయం..!
ఈ నేపథ్యంలోనే మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తూ చాలా మంది పునర్విక ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందజేశారు. ఈ క్రమంలోనే విరాళాల ద్వారా రూ.10కోట్లు సమకూరగా.. మరో రూ.6కోట్లు అవసరం అయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ గొప్ప మనస్సు చాటుకున్నారు. పునర్విక చికిత్స కోసం మిగిలిన రూ.6కోట్లు అందేలా చూసే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. ఈ మేరకు నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. క్లిష్ట సమయంలో పునర్విక కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ జాన్వీకపూర్ కూడా లోకేష్ పై ప్రశంసలు కురిపించింది.
Also Read : SUPREM COURT : NCERT పై సుప్రీంకోర్టు సీరియస్.. వివాదస్పద పుస్తకం బ్యాన్..!





