Medaram: కూలిపోతున్న మేడారం శిలలు ?

Are the Medaram rocks collapsing
Are the Medaram rocks collapsing

Medaram: తెలంగాణ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మాకంగా క‌ట్టిన మేడారం శిలలు కూలిపోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తోన్నాయి. రూ. 200 కోట్లతో అభివృద్ధి చేసింది రేవంత్ రెడ్డి సర్కార్‌. అయితే, కమీషన్ల కోసం అత్యంత నాసిరకంగా కట్టడంతో గ్రానైట్ శిలలు కూలుతున్న బీఆర్ ఎస్ పార్టీ సోష‌ల్ మీడియాలో ర్యాగింగ్ మొద‌లు పెట్టింది. Medaram

Are the Medaram rocks collapsing

నిర్మాణ పనులు పూర్తయి ఏడాది తిరగక ముందే గ్రానైట్ కట్టడాలు జారిపోతున్నట్లు ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రెండు రోజుల క్రితం గ్రానైట్ శిల జారడంతో పూజారి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. మహా జాతర ముగిసిన వారం రోజులకే గద్దెల చుట్టూ రాతి కట్టడాలు కూలిపోయిన సంఘ‌ట‌న‌లు చూపిస్తున్నారు గులాబీ పార్టీ నేత‌లు. Medaram

Also Read: VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాద‌స్ప‌దం..!

కొబ్బరి కాయల ధాటికి కూలింది అని మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ, వాస్త‌వం అది కాద‌ని అంటున్నారు. తాజా ఘటనతో మేడారం అభివృద్ధి పనుల డొల్లతనం మరోసారి బయటపడింద‌ని బీఆర్ ఎస్ నేత‌లు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని విమర్శిస్తున్నారు. మ‌రి దీనిపై తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. Medaram

Also Read: Raj Gopal Reddy : కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ డిన్నర్ మీటింగ్!

Share your love