Bakka Judson: తెలంగాణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు..బక్క జడ్సన్ ఫైర్‌

Bakka Judson
Bakka Judson

Bakka Judson: సీఎం చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిల‌పై బక్క జడ్సన్ ఫైర్ అయ్యారు. ఈ రోజు తెలంగాణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడని వెల్ల‌డించారు బక్క జడ్సన్. Bakka Judson

Bakka Judson slams cm revanth reddy chandrababu

చంద్రబాబును ఏమైనా అంటే కేసులు పెడుతామని తెలంగాణ పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వాలి? అని నిల‌దీశారు. తెలంగాణ పోలీసులకు ఏపీ ప్రభుత్వం జీతాలు ఇస్తుందా.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా ? అంటూ ప్ర‌శ్నించారు బక్క జడ్సన్. తెలంగాణ మీద చంద్రబాబు అధికారం నడుస్తుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు బక్క జడ్సన్. Bakka Judson

Also Read: BRS: గులాబీ పార్టీలోకి జీవ‌న్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్‌మెంట్ ?

ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశాడని మండిప‌డ్డారు బక్క జడ్సన్. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న టీజీవో, టీఎన్జీవో నాయకులు బంగారు పళ్లెంలో పెట్టి ఓట్లు వేయిస్తామని పొంగులేటికి చెబుతున్నారని నిప్పులు చెరిగారు. 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్లు మాట్లాడరు, ప్రభుత్వం డీఏలు, పీఆర్సీలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరని ఆగ్రహించారు. ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగ పని చేస్తున్నారు, దాని మీద పూర్తి ఆధారాలతో సహా తెలంగాణ ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేసానన్నారు. Bakka Judson

Also Read: Chandrababu: తెలంగాణ‌లో చంద్ర‌బాబును విమ‌ర్శిస్తే కేసా..?