
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ హఠావో, పాలిటిక్స్ బచావో రచయిత అనుమాదాస్పదంగా మృతి చెందారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత శ్రీనివాస్ మరణించారు. గతంలో పవన్ కళ్యాణ్ హఠావో… పాలిటిక్స్ బచావో అనే పుస్తకం శ్రీనివాస్ రాసిన సంగతి తెలిసిందే. Pawan Kalyan
Pawan Kalyan Boggula Srinivas srinivas died
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకంలో పవన్ కళ్యాణ్ అలాగే పరిటాల శివ సంఘటన కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు గుండు గీయించడం లాంటివి కూడా రాశారట. Pawan Kalyan
Also Read: BRS: కేసీఆర్ సీక్రెట్ ఏజెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి..బీఆర్ఎస్ చేతిలోకి 5 మున్సిపాలిటీలు…
అయితే తాజాగా ఈ పుస్తకం రాసిన శ్రీనివాస్ మరణించారు. నిన్న రచయిత శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకు వెళ్ళింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ దుర్మరణo చెందారు. ఇందులో డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో కుట్ర కోణం ఉందని వార్తలు వస్తున్నాయి. Pawan Kalyan
Also Read: BRS: మున్సిపల్ ఎన్నికలు..బీఆర్ఎస్ ఓటు షేర్ డబుల్..ఎంతంటే ?





