

Janasena: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన పార్టీలో చీలిక చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇటీవల ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ పై జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతనికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. Janasena
Janasena MLA Bolisetty Srinivas Sensational Comments on MLA Arava Sridhar
తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చిట్ చాట్ బయటకు వచ్చింది. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ పై అలాగే అతని వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి. అరవ శ్రీధర్ వ్యవహారం ఆయన వ్యక్తిగతం అన్నారు. దానికి తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. కావాలని జనసేన పార్టీకి రుద్దితే ఎలా అంటూ ఫైర్ అయ్యారు బొలిశెట్టి. Janasena
Also Read: Ambati Rambabu: అంబటి తగ్గేదేలే.. కూటమికి స్ట్రాంగ్ వార్నింగ్ ?
స్థాయి లేని వాళ్లను పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలను చేస్తే… ఇప్పుడు ఆయన పరువు తీస్తున్నారని నిప్పులు చెరిగారు. వైసీపీ పార్టీ హయాంలో జైలులో కష్టాలు పడి తాను ఎమ్మెల్యేను అయ్యానని బొలిశెట్టి వెల్లడించారు. కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచి తప్పుదారి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవ శ్రీధర్ అసెంబ్లీకి రావడానికి ముఖం చెల్లేదేమో అంటూ పరువు తీశారు బొలిశెట్టి. దీంతో బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. Janasena







