

Revanth reddy-Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన గులాబీ పార్టీ అలాగే అటు వైసీపీ పార్టీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డి పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి పని చేశారు. Revanth reddy-Chandrababu
Revanth reddy-Chandrababu photo viral
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్ రెడ్డిని ఇప్పటికి కూడా చంద్రబాబు శిష్యుడుగానే పరిగణిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తో పాటు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పక్కపక్కనే కూర్చొని నవ్వుకుంటూ క్లోజ్ గా కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలతోపాటు వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోలు బయటకు రావడంతో గులాబీ పార్టీ సోషల్ మీడియా దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది. Revanth reddy-Chandrababu
Also Read: Congress: జూబ్లీహిల్స్ విజయం..రంగంలోకి బాబు, కాంగ్రెస్ లోకి మరో 10 మంది ఎమ్మెల్యేలు ?
గురువు దగ్గర శిష్యుడు చేరిపోయాడని సెటైర్లు పేల్చుతోంది. అటు శిష్యుడి కోసం హైదరాబాద్ దాకా గురువు వెళ్లడని వైసీపీ ట్రోల్ చేస్తోంది. విజయవాడలో తక్కువ హైదరాబాదులో ఎక్కువ ఉంటున్నాడని చంద్రబాబును ర్యాగింగ్ చేస్తోంది వైసిపి సోషల్ మీడియా. ఇక ఆటో కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిపై ఫైర్ అవుతున్నారు. కూటమికి చెందిన చంద్రబాబుతో అంత క్లోజ్ గా ఉండటం అవసరమా అని రేవంత్ పై ఫైర్ అవుతున్నారు. దీనిపై రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Revanth reddy-Chandrababu
Also Read: IND vs SA: టీమిండియా ఓటమికి 5 కారణాలు ఇవే.. మెయిన్ విలన్ గౌతమ్…






