
Azharuddin: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతోంది. కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఈ ఉప ఎన్నిక పోలింగ్ కు ఉంది. ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. ఎలాగైనా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. రేపు అజారుద్దీన్ మంత్రి పదవి ప్రమాణ స్వీకరణ ఉంటుంది. Azharuddin
Former cricketer Azharuddin to be inducted into Telangana Cabinet on October 31
అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నలుగురు సీనియర్ నాయకులు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ కోసం చాలా రోజులుగా కష్టపడుతున్న షబ్బీర్ అలీ, మొన్న ఓడిపోయిన జగ్గారెడ్డి, మధు యాష్ కి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ కోసం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తారు.. Azharuddin
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శవాలు లేస్తాయి… గులాబీ పార్టీకి నవీన్ యాదవ్ వార్నింగ్…
కానీ పార్టీ కోసం కష్టపడ్డ తమకు ఎందుకు పదవి ఇవ్వబోరని వాళ్లు తిరుగుబాటుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమవుతునట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిని రేవంత్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. కాగా గులాబీ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మాగంటి సునీత బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ వైపు వస్తారని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.Azharuddin
Also Read: Snake gourd: పొట్లకాయని అస్సలు లైట్ తీసుకోవద్దు.. కాన్సర్ ను కూడా బొంద పెడుతుందట…





