Sholay: బ్లాక్ బస్టర్ “షోలే” రీమేక్.. ధర్మేంద్ర పాత్రకి ప్రభాస్.. అమితాబ్ పాత్రలో ఆ హీరో.?

Remake of the blockbuster Sholay

Sholay: 1975 లో వచ్చిన బ్లాక్ బస్టర్ షోలే మూవీ అప్పట్లో ఎంతోమంది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా ద్వారా అమితాబ్ బచ్చన్ స్టార్ అవ్వగా ధర్మేంద్రకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, జయ భాధురీలు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో వీరు, జై పాత్రలో ధర్మేంద్ర నటించగా..జై పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు.

Remake of the blockbuster Sholay

ఇక అప్పట్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాని ఓ డైరెక్టర్ తెలుగులో ప్రభాస్ తో పాటు మరో హీరోని పెట్టి రీమేక్ చేయాలి అనుకున్నారట. ఇక ఆ డైరెక్టర్ ఎవరంటే పూరి జగన్నాథ్..2011లో పూరి జగన్నాథ్ ప్రభాస్,గోపీచంద్ లతో షోలే మూవీ రీమేక్ చేస్తున్నట్టు పలు వార్తలు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ధర్మేంద్ర పోషించిన వీరు పాత్రలో ప్రభాస్.. (Sholay)

Also Read: Dharmendra: హేమమాలినితో పెళ్లి కోసం హిందూ మతాన్ని పక్కన పెట్టిన ధర్మేంద్ర..ఏం చేశారంటే.?

అమితాబ్ బచ్చన్ పోషించిన జై పాత్రలో గోపీచంద్ నటించబోతున్నట్టు పలు వార్తాపత్రికల్లో కూడా ప్రచురితమైంది.కానీ ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు.అలా చివరికి సినిమా రూమర్ గానే మిగిలిపోయింది.

Remake of the blockbuster Sholay

ఇక ఇందులో స్నేహితులుగా నటించిన అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర లాగే రియల్ లైఫ్ లో స్నేహితులైనటువంటి గోపీచంద్ ప్రభాస్ నటించిన సినిమా అద్భుతంగా ఉంటుంది అని ఆ మధ్య కాలంలో వార్తలు కూడా వినిపించాయి కానీ ఎందుకో ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. అలాగే ఈ సినిమా గురించి ఇప్పటివరకు పూరి జగన్నాథ్ కూడా ఎక్కడ అధికారికంగా మాట్లాడలేదు.(Sholay)

Share your love