I-Bomma: ఐ-బొమ్మ‌ రవి వకీల్ సాబ్ ఫీజ్ ఎన్ని కోట్లో తెలుసా ?

I-Bomma: ఐ-బొమ్మ రవి.. టాలీవుడ్ ఇండస్ట్రీ ని కుదిపేశాడు. ఎంతో కష్టపడి, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. వాళ్లకు తెలియకుండానే సైట్లు హ్యాక్ చేసి పైరసీకి తెర లేపాడు. ఇప్పటివరకు దాదాపు 21 వేల సినిమాలు పైరసీ చేశాడట ఐ బొమ్మ రవి. సినిమా రిలీజ్ కంటే వారం రోజుల ముందే చూసేవాడ‌ట‌. ఇమ్మడి రవి.. తన ఇంటిపేరునే ఐ-బొమ్మగా మార్చేశాడు. అంతేకాదు దాదాపు 50 లక్షల మంది యూజర్లను సంపాదించాడు. వాళ్ల డేటా మొత్తం కలెక్ట్ చేశాడు. I-Bomma

Advocate Abdul Saleem About I-Bomma Ravi Case Updates

కేవలం కిక్కు కోసమే పైరసీ చేసిన ఇమ్మడి రవి, గత వారం రోజుల కిందట అరెస్టయ్యాడు. అతని ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇమ్మడి రవి అరెస్ట్ అయిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. నిర్మాతలు అడ్డగోలుగా ఆ సినిమా టికెట్ల ధరలు పెంచితే అందరూ ఐ బొమ్మనే చూస్తారు అంటూ రవిని సపోర్ట్ చేస్తున్నారు. అలాంటోడ్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. I-Bomma

Also Read: Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC

ఈ నేపథ్యంలోనే ఇమ్మడి రవిని బయటకి తీసుకువచ్చేందుకు ఓ వకీల్ సాబ్ బయటకు వచ్చాడు. సలీం అనే వకీల్ సాబ్ ఈ కేసును డీల్ చేస్తున్నాడు. ఎలాగైనా ఇమ్మడి రవిని బయటకు తీసుకువస్తానని చెబుతున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ వకీల్ సాబ్ సలీంకు పాపులారిటీ వచ్చింది. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న పది కోట్ల మంది ఒక్కో రూపాయి వేసుకొని, వకీల్ సాబ్ కు ఫీజు ఇస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదే విషయాన్ని వకీల్ సాబ్ సలీం పేర్కొన్నాడు. అలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కో రూపాయి వేసిన 10 కోట్ల రూపాయలు అవుతాయి. దింతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయింది. I-Bomma

Also Read: Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి త‌ర‌లింపు..మ‌ళ్లీ ఏం జ‌రిగిందంటే ?

Share your love