“మెగా 157” ఇంకా ఖరారు కాని టైటిల్

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా మెగా 157. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, సంక్రాంతికి రఫ్పాడించేద్దాం అనే టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఖరారు చేస్తారా లేక కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా అనేది తెలియాల్సిఉంది. టైటిల్ విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ మేకర్స్ తీసుకోలేదనే … Read more

షూటింగ్స్ బంద్ – స్పందించిన ఫిలింఛాంబర్

24 క్రాఫ్టుల్లో పనిచేస్తున్న సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఈ రోజు నుంచి షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చింది. వేతనాలు పెంచి ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్ లకు మాత్రమే అన్ని యూనియన్స్ కార్మికులు హాజరవుతారని, పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని సినీ కార్మిక సమాఖ్య పేర్కొంది. కార్మికుల డిమాండ్స్ పై ఫిలింఛాంబర్ స్పందించింది. ఫిలింఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ లేఖ … Read more

“ఎస్ఎస్ఎంబీ 29” – ఆ విషయంలో అంతా సస్పెన్స్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి ఒక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. మహేష్‌ పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే పలు హాలీవుడ్ కంపెనీలతో టై అప్ అయ్యే ప్లానింగ్ జరుగుతుందట. … Read more

3 రోజుల్లో రూ.67 కోట్లు, బాక్సాఫీస్ పై “కింగ్డమ్” దండయాత్ర

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “కింగ్డమ్” సినిమా టాలీవుడ్ లో రీసెంట్ సెన్సేషన్ గా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రానికి 67 కోట్ల రూపాయల వసూళ్లు రావడం విశేషం. ఇదే జోరు కొనసాగితే కింగ్డమ్ సినిమా త్వరలోనే వంద కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. నిర్మాత నాగవంశీ చెప్పినట్లు 3 రోజుల్లోనే కింగ్డమ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు రీచ్ అవుతోంది. సినిమా బాగుందనే … Read more

ఈ విషయంలో ఏకైక తెలుగు చిత్రంగా “కింగ్డమ్” రికార్డ్

విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వెళ్తోంది. మలయాళ ఇండస్ట్రీలో ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి సర్ ప్రైజ్ చేసింది. నాన్ మలయాళ వెర్షన్ లో ఈ ఫీట్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా కింగ్డమ్ నిలిచింది. కింగ్డమ్ సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో ఏర్పడిన క్రేజ్ కు మలయాళంలో క్రియేట్ చేసిన రికార్డే ప్రూఫ్ గా చెప్పుకోవచ్చు. అర్జున్ రెడ్డి సినిమా టైమ్ … Read more

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న ఆహా

ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఆహా. ఆహా కార్యక్రమాల ద్వారా ఎంతోమంది న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమలో అవకాశాల పొందారు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3 పోటీదారులు నజీర్, భరత్ రాజ్ త్వరలో రాబోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలోని పాటకు తమ గాత్రాన్ని అందించారు తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహిరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సీజన్ 3 వేదికగా నజీర్, భరత్ రాజ్ అవకాశం ఇస్తానని … Read more

చదువూ లేదు సంధ్యా లేదు…!

వెబ్ సిరీస్ లలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది “90s మిడిల్ క్లాస్ బయోపిక్”. మిడిల్ క్లాస్ లైఫ్ ను ఈ వెబ్ సిరీస్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు ఆదిత్య హాసన్. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గా “లిటిల్ హార్ట్స్” అనే చిత్రాన్ని నిర్మించారు. ఈటీవీ ఒరిజినల్స్ గా తెరకెక్కిన ఈ సినిమాను కంటెంట్ నచ్చి సెప్టెంబర్ 12న థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి. … Read more

“బేబి” టీమ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్

రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న బేబి సినిమా టీమ్ కు తన శుభాకాంక్షలు తెలియజేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బేబి సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెలవడం సంతోషంగా ఉందని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేశ్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో అవార్డ్ రావడం, ఆయనకు దక్కిన సరైన గౌరవం అని అల్లు అర్జున్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. సాయి రాజేశ్ మరిన్ని అవార్డ్స్ గెల్చుకోవాలని అల్లు … Read more

“బేబి” మూవీ డబ్బుతో పాటు గౌరవాన్నీ ఇచ్చింది – నిర్మాత ఎస్ కేఎన్

నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకుంది కల్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ బేబి. ఈ సంతోషాన్ని మీడియా ముందు షేర్ చేసుకున్నారు మూవీ టీమ్. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాతలు ఎస్ కేఎన్, … Read more

ఫైర్ స్ట్రోమ్ …వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ నుంచి ఫైర్ స్ట్రోమ్ సింగిల్ రిలీజైంది. ఈ పాటను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేసిన మేకర్స్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బిగ్ బుల్ క్లబ్ లో రాత్రి 9 గంటలకు ఈవెంట్ చేయబోతున్నారు. ఈ పాటను ఫ్యాన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చేలా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశారు. అభిమానిగా పవన్ ఎలాంటి సినిమాలో నటిస్తో చూడాలని అనుకున్నానో అలాంటి మూవీ … Read more