
Naveen Yadav: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి నిన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 1500కి పైగా వార్డులను కాంగ్రెస్ గెలుచుకోగా 700 వరకు గులాబీ పార్టీ కూడా కైవసం చేసుకుంది. అలాగే 66 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇటు సింగిల్ గా 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ… మరో 15 మున్సిపాలిటీలలో కీలక పాత్ర పోషించనుంది. Naveen Yadav
Naveen Yadav hit hard padi kaushik reddy
అయితే ఈ నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బ కొట్టాడని నవీన్ యాదవును ఉప్పొగుడుతున్నారు కాంగ్రెస్ నేతలు. నవీన్ యాదవ్ ప్రచారం చేసిన నేపథ్యంలో హుజురాబాద్ మునిసిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించిందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో నవీన్ యాదవ్ ను ఓడించాలని పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Naveen Yadav
Also Read: Telangana: రేవంత్ స్కెచ్..తెలంగాణలో ఆ ఎన్నికల నోటిఫికేషన్ ?
కానీ ఆ సమయంలో పాడి కౌశిక్ రెడ్డి సక్సెస్ కాలేదు. ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో పాడి కౌశిక్ రెడ్డిని ఓడించేందుకు నవీన్ యాదవ్ ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. దీంతో హుజురాబాద్ మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఈ హుజురాబాద్ మున్సిపాలిటీలో 16 కాంగ్రెస్కు రాగా గులాబీ పార్టీకి 8 స్థానాలు దక్కాయి. మరో ఐదు స్థానాల్లో బిజెపి ముందుకు దూసుకు వెళ్లింది. Naveen Yadav
Also Read: KTR: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్ విజయకేతనం




















