Sivaji: ఐబొమ్మ రవి లాంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరం.. శివాజీ కామెంట్స్ వైరల్.!

Sivaji comments on Ibomma Ravi

Sivaji: ప్రస్తుతం మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఐ బొమ్మ వెబ్సైట్ కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అనే వ్యక్తి చాలా సినిమాలను హ్యాక్ చేసి, వెబ్ సైట్ లో అప్లోడ్ చేసేవారు. థియేటర్లోకి వెళ్లి ఖర్చు పెట్టి సినిమా చూడలేని చాలామంది వ్యక్తులు ఐ బొమ్మ సైట్ ని థియేటర్ గా భావించి సినిమాలు చూస్తుండేవారు. దీంతో ఎంతో మంది పేద మధ్య తరగతి ప్రజలు ఆహ్లాదాన్ని పొందేవారు..

Sivaji comments on Ibomma Ravi

అలాంటి ఐ బొమ్మ నిర్వాహకుడు అయినటువంటి రవి ప్రస్తుతం పోలీసులకు పట్టుబడ్డాడు. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులకు చుక్కలు చూపిస్తూ సినిమా ఇండస్ట్రీకి వారికి నష్టాలు కలిగిస్తున్నటువంటి ఈ వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ వ్యక్తి హైదరాబాద్ వస్తున్నాడని తెలుసుకొని పోలీసులు కాపు కాసి మరీ పట్టుకున్నారు. అతని నుంచి లాప్టాప్,పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. (Sivaji)

Also Read: Nagarjuna: ఫ్రీగా వస్తుందని సినిమా చూసేయకండి.. పర్సనల్ డేటా మొత్తం చోరీ..!

ఈ సందర్భంగా రవి పోలీసులకు చాలా విలువైన సమాచారం అందించారు. అసలు ఇలాంటి పని ఎందుకు చేసావు అని పోలీసులు ప్రశ్నించగా నాకు సినిమా థియేటర్లలోకి రాకముందే చూడడం ఆనందం అని, అందుకే అలా చేశానని చెప్పుకోచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ వెబ్సైట్ ని ఎందుకు హ్యాక్ చేశావని అడిగితే, నాకు అలా చేయడం ఇష్టం అసలు ప్రభుత్వాన్ని కూడా హ్యాక్ చేసే శక్తి నాకు ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేశానంటూ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే ఐ బొమ్మ రవిని పోలీసులు అరెస్టు చేయడంతో చాలామంది సామాన్యులు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Sivaji comments on Ibomma Ravi

ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఆయనను పొగిడేస్తున్నారు. ముఖ్యంగా నటుడు శివాజీ ఈ ఇష్యూ పై మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. అతడు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. అతని హ్యాకింగ్ తెలివిని దేశభద్రతకు పనికొచ్చేలా ఉపయోగించవచ్చని సూచించారు. అతను చేసింది తప్పు పనే కావచ్చు కానీ, రవికి ఉన్నటువంటి కసిని మంచి పనికి వినియోగిస్తే బాగుంటుంది. ఇకనుంచి అయినా రవి మారాలని కోరుకుంటున్నట్లు ఈ మూవీ ఈవెంట్లో శివాజీ పేర్కొన్నారు.(Sivaji)

Share your love